Tuesday 26 August 2014

చరిత్రలో జూలై మాసం

జూలై 1

డాక్టర్స్ డే (వైద్యుల దినోత్సవం).
1882 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ జననం(మ.1962).
1909 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు ఇంటూరి వెంకటేశ్వరరావు జననం(మ.2002).
1929 : తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా జననం(మ.1989).
1938 : అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జననం.
1961: అంతరిక్షం లోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జననం.
1962 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న గ్రహీత, స్వాతంత్ర్యసమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ మరణం(జ.1882).
1962 : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రత్న గ్రహీత పురుషోత్తమ దాస్ టాండన్ మరణం(జ.1882).
2006 : ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు కొరటాల సత్యనారాయణ మరణం(జ.1923).
1930 : దార అప్పలనారాయణ, (మారు పేరు కుమ్మరి మాస్టారు ), ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారుడు జననం(మ.1997).
1966 : దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రముఖ తెలుగుకవి, మరణం(జ.1921).

జూలై 2

1843: హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం (జ.1755).
1982 : ప్రముఖ విప్లవకవి చెరబండరాజు మరణం(జ.1944).
1961 : అమెరికా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత మరియు పాత్రికేయుడు ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం(జ.1899).
1995 : "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" , దూరవిద్య ప్రముఖుడు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి గడ్డం రాంరెడ్డి మరణం(జ.1929).
2002 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి మరణం(జ.1933).

జూలై 3

1918 : తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జననం. (మ.1974).
1914 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ జననం.
1924 : ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జననం.(మ.1999)
1927 : తెలుగు రచయిత, బలివాడ కాంతారావు జననం (మ. 2000).
1928 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి జననం.(మ.1990)
1980 : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం.

జూలై 4

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
టైక్వాండో దినోత్సవం.
1897: భారత స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం (మ.1923).
1898: రెండుసార్లు భారతదేశ ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసిన గుర్జారీలాల్ నందా జననం (మ.1998).
1902: ప్రసిద్ధి గాంచిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం (జ.1863).
1933 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం.
1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం (జ.1878).
1970: నక్సల్బరీ, శ్రీకాకుళము లలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విరసం (విప్లవ రచయిత సంఘం) ఏర్పడింది.

జూలై 5

1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికా లో మొదటిసారిగా స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన దేశం).
1916 : భారతదేశ 7 వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
1927 : గొప్ప భావుకుడైన తెలుగు కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మరియు రచయిత రావూరి భరద్వాజ జననం.
1946: 'బికిని' ఈత దుస్తులు మొదటిసారిగా పారిస్ ఫ్యాషన్ ప్రదర్శనలో కనిపించాయి.
1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది.
1954 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ను నెలకొల్పారు.
1975 : కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)
1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.

జూలై 6

మలావి స్వాతంత్ర్యదినోత్సవం.
1901 : జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, కోల్‌కత విశ్వవిద్యాలయం మాజీ కులపతి, మాజీ కేంద్ర మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ జననం (మ.1953).
1930 : ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం.
1935 : టిబెట్ దేశీయుల మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 14వ దలైలామా జన్మించాడు.
1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
1986 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త , దేశానికి ఉపప్రధానిగా పనిచేసిన జగ్జీవన్ రాం మరణం (జ.1908).

జూలై 7

1900 : ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు కళా వెంకటరావు జననం (మ.1959).
1908 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి జననం (మ.1970).
1914 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం (మ.2009).
1930 : స్కాట్లాండ్ కు చెందిన వైద్యుడు మరియు రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ మరణం (జ.1859).
1981 : భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జననం.
1985 : బోరిస్ బెకర్ అతి చిన్న వయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిసు ) లో గెలిచాడు.

జూలై 8

1898 : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒరిస్సా గవర్నరు గా ఉన్నత పదవులను అలంకరించిన కుమారస్వామి రాజా జననం (మ.1957).
1914 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతంచేసుకున్న జ్యోతిబసు జననం (మ.2010).
1921 : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం (మ.2011).
1949 : ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకుడు వై.యస్. రాజశేఖరరెడ్డి జననం (మ.2009).
1972 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
1978: తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్య సమర యోధుడు నాయని సుబ్బారావు మరణం (జ.1899).
2007 : భారత దేశపు 11వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మరణం (జ.1927).

జూలై 9

అర్జెంటీనా జాతీయ దినోత్సవం
1875 : బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.
1918 : ఒక సుప్రసిద్ధ తత్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి జననం (మ.2007).
1920 : భారత కమ్యూనిష్టు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ జననం.
1925 : భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు గురుదత్ జననం(మ.1964).
1927 : తెలుగు సినిమా రంగంలో గుమ్మడి గా పేరు పొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు జననం (మ.2010).
1966 : ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ జననం.
1969 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకటపతి రాజు జననం.
1969: భారత వన్యప్రాణి బోర్డు, పులి ని జాతీయ జంతువు గా ప్రకటించింది

జూలై 10

1794 : పద్మనాభ యుద్ధం జరిగింది.
1846 : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
1916 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి, కాంగ్రెసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కోన ప్రభాకరరావు జననం.
1920 : ప్రముఖ రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జననం (మ.2007).
1928 : భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి జననం (మ.2009).
1939 : ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి జననం.
1945 : కోట అని ముద్దుగా పిలువబడే ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాసరావు జననం.
1966: భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణించాడు (జ.1883).
1978: జర్నలిస్ట్ నరేందర్ జన్మదినం.

జూలై 11

మంగోలియా జాతీయదినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం.
1907 : ప్రముఖ రంగస్థల నటుడు, తెలుగు సినీ నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు జననం (మ.1963).
1955 : భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
1964 : ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ జననం.
1987 : ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. అందుకే, ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవం గా 1987 నుంచి జరుపు కుంటున్నారు.
2007 : తెలుగు సినిమా నటుడు శ్రీధర్ మరణం (జ.1939).

జూలై 12

బెల్జియం జాతీయ దినం.
1884 : ఫ్రాన్సులో అధికంగా పనిచేసిన ఒక ఇటాలియన్ కళాకారుడు అమేడియో మొడిగ్లియాని జననం (మ.1920).
1904 : స్పానిష్ కవి, నోబెల్ బహుమతి గ్రహీత, రాజకీయ నాయకుడు, చిలీ దేశస్తుడు అయిన పాబ్లో నెరుడా జననం (మ.1973)
1923 : మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం (జ.1877).
1933 : తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, లోకసభ సభ్యుడు గడ్డం గంగారెడ్డి జననం.
1957 : ప్రముఖ రంగస్థల నటీమణి శ్రీలక్ష్మి రేబాల జననం.
1982 : ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ జననం.
1840 : కర్నూలు గత నవాబ్ గులామ్ రసూల్ రసూల్ ఖాన్ మరణం

జూలై 13

క్రీ.పూ. 100 : రోమన్ నియంత జూలియస్ సీజర్ జననం (మ.44 క్రీ.పూ.).
1643 : ఆంగ్లేయుల అంతర్యుద్ధం.
1941 : వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున 8 వ లోకసభ సభ్యురాలు టి. కల్పనాదేవి జననం.
1964: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జననం.
2004 : భారతదేశములో మొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, జనరల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ యొక్క తొలి కేంద్రమును గుమ్మడిదల లో ప్రారంభించారు.

జూలై 14

1893 : స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత మా కొద్దీ తెల్ల దొరతనం .... పాటతో సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించిన గరిమెళ్ల సత్యనారాయణ జననం (మ.1952).
1907 : ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీపెర్కిన్ మరణం (జ.1838).
1904 : ప్రజావైద్యుడు, గాంధేయవాది, వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రెండు లక్షల కంటి శస్త్రచికిత్సలు, ఉచిత వైద్యసేవ చేసిన వెంపటి సూర్యనారాయణ జననం (మ.1993).
1954 : భారతీయ పాత్రికేయుడు, చలనచిత్ర నటుడు, రాజకీయ నేత్త, బాడీ బిల్డర్ మరియు ప్రస్తుతం దక్షిణ భారతీయ చిత్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ జననం.
1956 : తెలుగు సినిమా నటుడు, రచయత, తెలుగు భాషాభిమాని తనికెళ్ళ భరణి జననం.
1967 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు హసన్ తిలకరత్నె జననం.

జూలై 15

2013 : భారత దేశం లో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడినది.
1820 : బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకడైన అక్షయ్ కుమార్ దత్తా జననం (మ.1886).
1885 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు పి.ఏ.థాను పిళ్లై జననం (మ.1970).
1902 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు జననం (మ.1976).
1903 : తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు, భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ జననం (మ.1975).
1909 : తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి దుర్గాబాయి దేశ్‌ముఖ్ జననం (మ.1981).
1920 : సినీ కథా రచయిత డి.వి.నరసరాజు జననం (మ.2006).

జూలై 16

1896: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ జననం (మ.1968).
1909 : ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీ జననం (మ.1996).
1924 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం (మ.2007).
1945 : ప్రప్రధమ అణుపరీక్ష అమెరికా "ట్రినిటీ సైట్" అనే చోట చేపట్టింది.
1965 : తెలుగులో ఉన్న బహుకొద్దిమంది మంచి కార్టూనిస్టుల్లో ఒకరైన శేఖర్ జననం.
1968 : ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అయిన వికీపీడియా కు సంపాదకుడు లారీ సాంగర్ జననం.(ప్రక్క చిత్రంలో)
1968 : ఒక ఫీల్డ్ హాకీ ఆటగాడు మరియు భారత హాకీ జట్టు యొక్క మాజీ సారథి ధనరాజ్ పిళ్ళై జననం.
1984 : ఒక బ్రిటిష్-భారతీయ నటి మరియు మోడల్ కత్రినా కైఫ్ జననం.

జూలై 17

656 : ఇస్లామీయ చరిత్ర లో తన పాత్రను ప్రముఖంగా పోషించినవారిలో ఒకడు. రాషిదూన్ ఖలీఫాలలో మూడవవాడు ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరణం (జ.580).
1790 : స్కాట్లాండు కు చెందిన ఆర్ధికవేత్త, తాత్వికుడు, రచయిత ఆడం స్మిత్ మరణం (జ.1723 ).
1841 : పంచ్ (Punch)అనే ప్రసిద్ధ పత్రిక తొలి సంచిక విడుదలైంది.
1917 : ప్రముఖ తెలుగు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం (మ.2006).
1917 : బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, సంపాదకుడు మరియు కర్షకోద్యమ నిర్మాత దరువూరి వీరయ్య జననం.
2009 : టాటా నానో కార్లను లక్షరూపాయలకు అందించటం ప్రారంభించారు.

జూలై 18

1860 : కవి మరియు శాసన పరిశోధకుడు జయంతి రామయ్య పంతులు జననం (మ.1941).
1919 : మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు జయచామరాజ వడయార్‌ బహదూర్ జననం (మ.1974).
1918 : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు నెల్సన్ మండేలా జననం.(మ.2013)
1931 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జననం (మ.2002).
1972 : ప్రముఖ సినీనటి సౌందర్య జననం (మ.2004).
1974 : నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించిన ఘనుడు ఎస్వీ రంగారావు మరణం (జ.1918).
1982 : భారతీయ నటి మరియు మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జననం.
1995 : ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకుడు మరియు నాటక కర్త రెంటాల గోపాలకృష్ణ మరణం (జ.1922).

జూలై 19

1827 : , ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంటునందు ఒక సిపాయి, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు మంగళ్ పాండే జననం (మ.1857).
1905 : అప్పటి భారత వైస్రాయి అయినటువంటి లార్డ్ కర్జన్ చే బెంగాల్ విభజన యొక్క నిర్ణయం ప్రకటించబడింది.
1955 : పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ జననం.
1969 : కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
1985 : ముమ్మిడివరం బాలయోగి కైవల్య సిద్ధి (మరణించిన రోజు).
1993 : భారత్ ఇన్‌సాట్ -II బి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

జూలై 20

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన రోజు
క్రీ.పూ 356 : గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు అలెగ్జాండర్ జననం (మరణం. క్రీ.పూ.323).
1837 : ఇటలీ దేశమునకు చెందిన ఆవిష్కర్త. ఇతడు సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధిచేయుటలో పితామహుడుగా ప్రసిద్ది చెందిన గూగ్లి ఎల్మో మార్కోని మరణం (జ.1874).
1892 : ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత కవికొండల వెంకటరావు జననం (మ.1969).
1919 : న్యూజిలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు, షెర్పా టెన్సింగ్ నార్గే తో కలసి మొట్టమొదట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ జననం (మ.2008).
1969 : నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన తొలి మానవుడు.
1972 : హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు, మరియు ఆధునిక బెంగాలీ గీతాలను ఆలపించిన గాయకురాలు గీతా దత్ మరణం (జ.1930).
1973 : అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు బ్రూస్ లీ మరణం (జ.1940).

జూలై 21

1831: బెల్జియం జాతీయదినోత్సవం
1883: భారతదేశంలో మొట్టమొదటి సినిమా థియేటర్ అయిన స్టార్ థియేటర్ కలకత్తా లో ప్రారంభమయ్యింది.
1960: శ్రీలంక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి సిరిమావో బండారు నాయకే, ప్రపంచములో ఒక దేశానికి ప్రధాని అయిన మొట్టమొదటి మహిళ అయ్యింది.
1969: చంద్రుడి మీద మొదటి సారిగా మొదటి మనిషి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ , రెండవ మనిషి ఆల్డ్రిన్ కాలు పెట్టిన రోజు (అపోలో 11).
1972: భారత దేశానికి అత్యంత ఆప్తుడు అయిన భూటాన్ రాజు జిగ్మె దొరి వాంగ్ ఛుక్ మరణం (జ. 1929).
1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.
2009: ప్రముఖ హిందుస్తాని గాయని పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీమతి గంగూబాయ్ హంగళ్ పరమపదించింది (జ. 1913).

జూలై 22

1922 : ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సతీమణి పుట్టపర్తి కనకమ్మ జననం (మ.1983).
1923 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడుముకేష్ జననం (మ.1976).
1925 : తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జననం (మ.1987).
1944 : పోలండ్ జాతీయదినోత్సవం.
1947 : పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయపతాకముగా అమోదం పొందింది.
1965 : తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జననం.

జూలై 23

1856: భారతజాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ జననం (మ.1920).
1906 : భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం (మ.1931).
1953 : ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ జననం.
1975 : ప్రముఖ తమిళ నటుడు సూర్య జననం.
1983: కల్పాక్కం (చెన్నై దగ్గర) అణు విద్యుత్ కేంద్రం లో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.
2004 : భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమాలలో హాస్య పాత్రలలో నటించడం ద్వారా అందరికీ సుపరిచితుడైన మెహమూద్ మరణం (జ.1932).

జూలై 24

1974 : పరమాణువు లోని మౌలిక కణం న్యూట్రాన్ ను కనుగొన్నందుకు భౌతిక శాస్త్రము లో నోబుల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్ మరణం (జ.1891).
1890 : గ్రంథాలయోద్యమ పితామహ, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జననం (మ.1989).
1899 : గోదావరి పై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మరణం (జ.1803).
1932 : రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.
1945 : గుజరాత్ కు చెందిన ప్రముఖ ఇంజనీరు, మరియు పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్‌జీ జననం.
1953 : ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య జననం (మ.2006).
1971: ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా మరణం (జ.1895).

జూలై 25

1935 : తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ జననం.
1952 : ప్రముఖ మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం కళాకారుడు లోకనాథం నందికేశ్వరరావు జననం.
1977 : భారత రాష్ట్రపతి గా నీలం సంజీవరెడ్డి అధికారం చేపట్టాడు.
1981 : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము అనంతపురం లో స్థాపించబడినది.
1982 : భారత రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్‌సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
1987 : భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకట రామన్ అధికారంలోకి వచ్చాడు.
1992 : శంకర్ దయాళ్ శర్మ భారత రాష్ట్రపతిగా పదవిలోకి వచ్చాడు.
1997 : కె.ఆర్.నారాయణన్ భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.
2002 : భారత రాష్ట్రపతిగా ఎ.పి.జె.అబ్దుల్ కలాం అధికారం చేపట్టాడు.
2007 : భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ అధికార బాధ్యతలు స్వీకరించింది.

జూలై 26

1856 : ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం.(మ.1950)
1975 : గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు మరణం.(మ.1902)
1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన గులాబ్‌రాయ్ రాంచంద్ జననం.(మ.2003)
1935 : కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు కోనేరు రంగారావు జననం.
1956 : ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాసర్ సూయజ్ కాలువ ను జాతీయం చేసాడు.
2009 : భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలప్రవేశం.
2011 : విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి మరణం.(జ.1929).

జూలై 27

1955 : ఆస్ట్రేలియా కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలాన్ బోర్డర్ జననం.
1967 : భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త మరియు రగ్బీ యూనియన్ ఆటగాడు రాహుల్ బోస్ జననం.
1970 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కేరళ ముఖ్యమంత్రి గా పనిచేసిన పీ.ఏ.థాను పిల్లై (జ.1885).
1987 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ మరణం (జ.1896).
2002 : భారత ఉప రాష్ట్రపతిగాను, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేసిన కృష్ణకాంత్ మరణం (జ.1927).
2003 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాస్యజీవి, రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు జీవించిన ధన్యజీవి బాబ్ హోప్ మరణం (జ.1903).

జూలై 28

1909 : ఆంధ్ర ప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి జననం (మ.1994).
1914 : మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.
1956 : రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరుగాంచిన దీవి శ్రీనివాస దీక్షితులు జననం.
1978 : న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారులు జేకబ్ ఓరం జననం.
1979 : భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం.
2007 : ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్త బందులో ముదిగొండ వద్ద పోలీసు కాల్పులు జరిగి, ఏడుగురు మరణించారు.

జూలై 29

1883 : ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముస్సోలినీ జననం (మ.1945).
1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరణం (జ.1820).
1904 : భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు జె.ఆర్.డి.టాటా జననం (మ.1993).
1931: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం.
1932 : భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు మెహమూద్ జననం (మ.2004).
1975 : శ్రీలంక కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు లంక డిసిల్వా జననం.
1976: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.
2004 : ఇండియన్ మోడల్ మరియు 1997 మిస్ ఇండియా యూనివర్స్ విజేత నఫీసా జోసెఫ్ మరణం (జ.1979).

జూలై 30

762: బాగ్దాద్ నగరం స్థాపించబడినది.
1896 : సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికధర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పండిత గోపదేవ్ జననం (మ.1996).
1947 : అమెరికన్ దేహదారుఢ్యకుడు, నటుడు, మోడల్, వ్యాపారవేత్త మరియు రాజకీయనాయకుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ జననం.
1931: కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు పులికంటి కృష్ణారెడ్డి జననం (మ.2007).
1939 : ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత గోపరాజు సమరం జననం.

జూలై 31

1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవి కి చేరుకున్నాడు.
1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత జననం.
1980 : ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ మరణం (జ.1924).
1880 : భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి ప్రేమ్‌చంద్ జననం (మ.1936).
2007: ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది.
2004 : ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం (జ.1922).

No comments:

Post a Comment

Rs. 150 .Com at GoDaddy.com!