Tuesday 26 August 2014

చరిత్రలో ఆగస్ట్ మాసం

ఆగష్టు 1

10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి పుట్టిన రోజు (మ. 54).
1779: అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్‌ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు (మ.1843).
1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39,29,214 మాత్రమే.
1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో చేరింది.
1920: భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ మరణించాడు (జ.1856).
1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు.
1946: అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం.
1955: భారతీయ రైల్వేలో, ఆగ్నేయ రైల్వే ఏర్పడింది (1 ఆగష్టు 1955).
1981: ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్"

ఆగష్టు 2

1861 : బెంగాళీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ జననం(మ.1944).
1870 : ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు..
1878 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం (మ.1963).
1922 : టెలిఫోన్ ఆవిష్కర్త, స్కాటిష్-కెనెడియన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం. (జ. 1847).
1924 : స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జననం(మ. 2014)
1932 : ఎలక్ట్రాన్ యొక్క వ్యతిరేక కణమైన పాజిట్రాన్ ను కార్ల్ డేవిడ్ అండర్సన్ కనుగొన్నాడు.
1966 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఎం.వి.శ్రీధర్ జననం.
1979 : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత దేవి శ్రీ ప్రసాద్ జననం.

ఆగష్టు 3

1858 : విక్టోరియా సరస్సు , నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
1907 : పోర్చుగల్ లో ఆదివారం ను విశ్రాంతి దినం గా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
1913 : ప్రముఖ సంగీత విధ్వాంసుడు శ్రీపాద పినాకపాణి జననం.(మ.2013)
1914 : కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది.
1948 : 1960 మరియు 1970 దశకము లలో పేరొందిన తెలుగు సినిమా నటి వాణిశ్రీ జననం.
1956 : ప్రముఖ న్యాయవాది, మేఘాలయ రాష్ట్రానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి టి. మీనాకుమారి జననం.
1958 : మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్; అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర ధృవాన్ని, దాటింది.
2003 : అమెరికా లోని ఆంగ్లికన్ చర్చి, హిజ్రా (కొజ్జా) ని బిషప్ గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు.

ఆగష్టు 4

1755 :మనం నేడు వాడుతున్న "పెన్సిలు" ను కనిపెట్టిన నికోలస్ జాక్వె కోంటె జననం (మ.1805).
1777: రిటైర్ అయిన బ్రిటిష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కసు ను ప్రారంభించాడు.
1929 : ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ జననం (మ.1987).
1948 : తొమ్మిది, పది మరియు పన్నెండవ పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎన్నికైన నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు జననం.
1954 : భారత లోక్ సభ సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు నాయకుడు ఉండవల్లి అరుణ కుమార్ జననం.
1960 : భారతీయ చిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ రచయిత, సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు విశాల్ భరద్వాజ్ జననం.
1961 : అమెరికా 44వ అధ్యక్షుడుబరాక్ ఒబామా జననం.
1967 : నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
1971: అమెరికా, మనుషులు ఉన్న అంతరిక్షనౌక నుంచి, మొదటి సారిగా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.

ఆగష్టు 5

1908 : ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడులు, సినీ నిర్మాత మరియు దర్శకుడు చక్రపాణి జననం(మ.1975).
1912 : ఆరుసార్లు లోక్‌సభ కు ఎన్నికైన తెలుగు మేధావి కొత్త రఘురామయ్య జననం. (మ. 1979)
1930 : చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం.(మ.2012)
1962 : నెల్సన్ మండేలా ని నిర్బంధించి, చెఱసాల లో బంధించారు.
1962 : మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి మరణం (జ.1926).
1974 : ప్రముఖ భారతీయ సినీ నటి కాజోల్ జననం.
1982 : ప్రముఖ తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ సినిమా నటి జెనీలియా జననం.
1991 : హోండా కంపెనీ ని స్థాపించిన సొయిఛిరో హోండా, కాలేయ కేన్సర్ తో 84వ యేట మరణం (జ.1906).

ఆగష్టు 6

1809 : బ్రిటను కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి టెన్నిసన్ జననం (మ.1892).
1881 - నోబెల్ బహుమతి గ్రహీత, పెన్సిలిన్ కనిపెట్టిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం (మ.1955).
1912 : రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియు లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించిన కొత్త రఘురామయ్య జననం (మ.1979).
1925 : బ్రిటిషు పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకులలో ఒకడు, తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించిన సురేంద్రనాథ్ బెనర్జీ మరణం(జ.1848).
1933 - భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు ఎ.జి. కృపాల్ సింగ్ జననం (మ.1987).
1934 : తెలంగాణా మహాత్ముడు.. తెలంగాణ జాతి పిత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌ జననం (మ.2011).
1945 - రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా , జపాను లోని హిరోషిమా నగరం మీద అణుబాంబు ప్రయోగించింది. ప్రపంచ హిరోషిమా రోజు" గా పాటిస్తారు.
1981 : భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు దండమూడి రాజగోపాలరావు మరణం (జ.1916).
1991 :వరల్డ్ వైడ్ వెబ్ ( www )] ఇంటర్‌నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ.

ఆగష్టు 7

1890 : గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు, 'గ్రంధాలయ పితామహుడు'గా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జననం (మ.1979).
1907: స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం (మ.1997).
1925: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ జననం.
1941: భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మరణం (జ.1861).
1960: ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము.
1966 : అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియా ను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రోజెక్టులు ప్రారంభించిన వ్యక్తి జిమ్మీ వేల్స్ జననం.
1980 : భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2004 లో ఫ్రాన్స్ లోని టౌలోస్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ లో విజయం సాధించిన చేతన్ ఆనంద్ జననం.

ఆగష్టు 8

1870: తిరుపతి వేంకటకవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జననం (మ.1950).(చిత్రంలో)
1942: బొంబాయి లో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది.
1948: భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు యల్లాప్రగడ సుబ్బారావు మరణం (జ.1895).
1981 : స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ జననం.
2008 : రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం.
2010 : ప్రముఖ స్వాతంత్ర్య యోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ మరణం (జ.1914).

ఆగష్టు 9

సింగపూరు జాతీయదినోత్సవం.
జాతీయ గ్రంథాలయ దినోత్సవం.
1892 : భారతదేశ గ్రంథాలయ పితామహుడు, పద్మశ్రీ షియాలి రామామృత రంగనాధన్.జననం.(మ.1972).
1942: క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
1945: జపాన్ లోని నాగసాకి పట్టణముపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది.
1948 : భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి యల్లాప్రగడ సుబ్బారావు మరణం.(జ.1895)
1960: తెలుగు సినిమా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం.(మ.2013)
1975 : తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు ఘట్టమనేని మహేశ్ ‌బాబు జననం.

ఆగష్టు 10

1860 : భారతదేశ గాయకుడు సంగీతదర్శకుడు విష్ణు నారాయణ్ భట్‌ ఖండే జననం (మ.1936).
1894 : భారతదేశ నాల్గవ రాష్ట్రపతి వి.వి.గిరి జననం (మ.1980).
1914 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జననం(మ.1977).
1915 : రసాయన మూలకాలను వర్గీకరించుటకు విస్తృత ఆవర్తన పట్టికను రూపొందించిన శాస్త్రవేత్త మోస్లే మరణం (జ. 1887).
1918 : తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి జననం(మ.1985).
1974 : ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు రామోజీరావు చే విశాఖపట్నం నుంచి ప్రారంభం.
2003 : యూరీ మాలెన్‌చెంకో అంతరిక్షం లో వివాహం చేసుకుని చరిత్రలో తొలివ్యక్తిగా నిలిచాడు.

ఆగష్టు 11

1926 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య జననం (మ.1984).
1943 : పాకిస్తాన్ సైన్యం యొక్క సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేసిన ఒక పాకిస్తానీ రాజకీయవేత్త మరియు సైనిక నాయకుడు పర్వేజ్ ముషార్రఫ్ జననం.
1949 : భారతీయ రిజర్వ్ బాంక్ కు 22 వ గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు జననం.
1953 : నైపుణ్యం కలిగిన కుస్తీ యోధుడు హల్క్ హొగన్ జననం.
1960 : చాద్ స్వాతంత్ర్యం పొందింది.
1962 : ప్రముఖ కవి, రచయిత పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి మరణం(జ.1900).
2008 : భారత దేశానికి చెందిన అభినవ్ బింద్రా ఒలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు

ఆగష్టు 12

క్రీ.పూ (30) : గ్రీకు సంతతి కుటుంబానికి చెందిన టోలమాక్ రాజవంశపు స్త్రీ క్లియోపాత్రా మరణం.
అంతర్జాతీయ యువ దినోత్సవం.
1919: భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు విక్రం సారాభాయ్ జననం (మ.1971).
1930 : హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు జార్జ్ సోరోస్ జననం.
1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్ కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టాడు.
1944 : మంగళగిరి లో అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించి అనేక మందికి సేవలు అందించిన కైవారం బాలాంబ మరణం (జ.1849).
1965 : ప్రముఖ కళాకారుడు, విమోచనోద్యమకారుడు పల్లెర్ల రామ్మోహనరావు జననం.
1972 : భారతదేశ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం.
1989 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లియం షాక్లీ మరణం (జ.1910).

ఆగష్టు 13

ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినం.
1910 : లేడి విత్ ది లాంప్ గా పేరెన్నికగన్న ప్రముఖ సమాజ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం (జ.1820).
1926 : క్యూబా రాజకీయ నాయకుడు మరియు విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో జననం.
1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త సి.రంగరాజన్ జననం.
1934 : ఆంధ్ర దేశంలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించిన ప్రముఖ ఐ.ఎ.ఎస్. అధికారి, రచయిత ఎక్కిరాల వేదవ్యాస జననం.
1936 : పాత తరం తెలుగు మరియు తమిళ సినిమా నటి వైజయంతిమాల జననం.
1952 : హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం.
1954: రేడియో పాకిస్తాన్, మొదటిసారిగా, పాకిస్తాన్ జాతీయగీతం ను, ప్రసారం చేసింది.
1961 : ప్రసిద్ధి చెందిన బెర్లిన్ గోడ ప్రారంభించారు (1989 లో దీనిని కూలగొట్టి, తూర్పు, పశ్చిమ బెర్లిన్ నగరాలను ఏకం చేశారు).
1963 : తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించిన శ్రీదేవి జననం.
1975 : పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ జననం.
2004 : స్వేచ్ఛా నకలు హక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి వికీబుక్స్ ప్రారంభం.

ఆగష్టు 14

1895 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించిన మాగంటి బాపినీడు జననం.
1933 : తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అక్కినేని అన్నపూర్ణ జననం (మ.2011).
1947 : భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
1958 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ మరణం (జ.1900).
1966 : ఒక అమెరికన్ నటి, మాజీ అభినేత్రి, మరియు అందాల రాణి హాలీ బెర్రీ జననం.
1968 : భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు ప్రవీణ్ ఆమ్రే జననం.
2011 : భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు షమ్మీ కపూర్ మరణం (జ.1931).

ఆగష్టు 15

1872: సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు అరవిందుడు జననం (మ.1950).
1913 : బాలబంధు బిరుదాంకితుడు, ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు బాడిగ వెంకట నరసింహారావు జననం (మ.1994).
1935 : అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి రాజసులోచన జననం.(మ.2013)
1938 : ఆంధ్రప్రభ దినపత్రికను చెన్నై లో, పారిశ్రామిక వేత్త రామనాథ్ గోయెంకా మొదలు పెట్టారు.
1947 : భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు.
1949 : తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత మైలవరపు గోపి జననం.
1949 : ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య మరణం (జ.1866).
1950 : విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
1961 : ప్రముఖ దక్షిణ భారత నటి సుహాసిని జననం.
1969 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ను స్థాపించారు.
1975 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్ జననం.
1972 : భారత్ లో పోస్టలు ఇండెక్సు నంబరు (PIN) అమలు లోకి వచ్చింది.

ఆగష్టు 16

1886 : ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణం (జ.1836).
1909 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సర్దార్ బిరుదాంకితుడు గౌతు లచ్చన్న జననం (మ.2006).
1919 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జననం (మ.1986).
1920 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి జననం (మ.2001).
1958 : అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్) జననం.
1981 : బ్రిటిష్ ఇండియన్ మోడల్ మరియు బాలీవుడ్ చలనచిత్ర నటుడు ఉపేన్ పటేల్ జననం.
1996 ; వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు చర్ల గణపతిశాస్త్రి మరణం (జ.1909).
2010 : ప్రసిద్ధ ప్లాస్టిక్ సర్జన్ డా. ఫ్రాంక్ ర్యాన్ , 50వ ఏట, కారు ప్రమాదంలో మరణించాడు.

ఆగష్టు 17

ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
1943 : అమెరికన్ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత రాబర్ట్ డి నీరో జననం.
1957 : భారతీయ చలనచిత్ర మరియు బుల్లితెర నటుడు, దర్శకుడు మరియు నిర్మాత సచిన్ జననం.
1962 : దళిత ఉద్యమ నేత, 15వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడు తిరుమవళవన్ జననం.
1962 : కవి, విమర్శకుడు మరియు చిత్రకారుడు మాకినీడి సూర్య భాస్కర్ జననం.
1980 : ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు మరణం (జ.1909).

ఆగష్టు 18

1650 : పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేసిన సర్వాయి పాపన్న జననం.
1900 : సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త మరియు దౌత్య వేత్త విజయలక్ష్మి పండిట్ జననం (మ.1990).
1936 : చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత గుల్జార్ జననం.
1939 : మొట్టమొదటి సారిగా, నలుపు-తెలుపు ఫిల్మ్, రంగుల ఫిల్మ్ లను, కలిపి వాడుతూ తీసిన చలన చిత్రం "విజార్డ్ ఆఫ్ ఓజ్" ప్రదర్శించారు.
1969 : అమెరికా చలనచిత్ర నటుడు, కథకుడు మరియు దర్శకుడు ఎడ్వర్డ్ నార్టన్ జననం.
1983 : ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు మరియు ప్రస్తుత ఆస్ట్రేలియా ట్వంటీ20 జట్టు కెప్టెన్ కామెరాన్ వైట్ జననం.
1988: పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ జియా ఉల్ హక్, అమెరికా రాయబారి ఆర్నాల్డ్ రాఫెల్ అంతుచిక్కని విమాన ప్రమాదంలో మరణించారు.
1998 : భారతీయ మోడల్ మరియు ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడి మరణం (జ.1948).
2009 : వికీపీడీయా (ఇంగ్లీషు) లోని వ్యాసాలు 30 లక్షలకి చేరిన రోజు.
: పార్సి నూతన సంవత్సర ప్రారంబం

ఆగష్టు 19

ప్రపంచ మానవత్వపు దినము (ప్రపంచ వ్యాప్తంగా)
ప్రపంచ ఫోటో దినము
0014 : ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణం (జ.63 బి.సి). ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
1918 : భారత స్వాతంత్ర్య సమరయోథుడు, పండితుడు మరియు భారత 9 వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ జననం (మ.1999).
1919 : ఆఫ్ఘనిస్తాన్ పూర్వ బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం పొందినది.
1925 : తెలుగు సినిమా నిర్మాత మరియు నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య జననం (మ.2012).
1946 : అమెరికా 42 వ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జననం.
1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.
1991 : సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. సెలవులో ఉన్న సోవియెట్ ప్రెసిడెంట్ మిఖయిల్ గోర్బచెవ్‌ ను గృహ నిర్బంధంలో ఉంచారు.

ఆగష్టు 20

ప్రపంచ దోమల దినోత్సవం
1931 : ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు బి. పద్మనాభం జననం (మ.2010).
1944 : భారతదేశ ఆరవ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జననం (మ.1991).
1946 : భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, సాఫ్టువేరు ఇంజనీరు మరియు ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు నారాయణమూర్తి జననం.
1974 : అమెరికా దేశానికి చెందిన నటి మరియు గాయకురాలు ఏమీ ఆడమ్స్ జననం.
1977 : వోయెజర్ 2 ఒక మానవరహిత అంతర్ గ్రహ అంతరిక్ష నౌక ను నాసా అమెరికా వారు ప్రవేశపెట్టారు.
1992 : అమెరికన్ గాయని, గీత రచయిత్రి, సంగీత కళాకారిణి మరియు నటి డెమీ లొవాటో జననం.
2012 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య మరణం (జ.1925).

ఆగష్టు 21

జాతీయ వృద్ధుల దినోత్షవం.
1914 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత పి.ఆదినారాయణరావు జననం (మ.1991).
1921 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జననం (మ.2012).
1940 : ప్రముఖ చిత్రకారుడు, ముద్రణ మరియు డ్రాఫ్టింగ్ దిట్ట లక్ష్మా గౌడ్ జననం.
1978 : ప్రముఖ తెలుగు సినిమా నటీమణి భూమిక జననం.
1986 : జమైకా దేశానికి చెందిన ప్రముఖ పరుగు వీరుడు మరియు మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించిన ఉసేన్ బోల్ట్ జననం.
1992 : కె.ఆర్.నారాయణన్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు.
2006 : భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణం (జ.1916)

ఆగష్టు 22

1869 : నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితుడైన మొదటి హిందువు పింగళి వెంకట రామారెడ్డి జననం (మ.1953).
1922 : అల్లూరి సీతారామరాజు ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడినది.
1955 : తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు, కాంగ్రెసు పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి చిరంజీవి జననం.
1964 : ప్రముఖ రంగస్థల నటీమణి రేకందాస్ గుణవతి జననం.

ఆగష్టు 23

1872 : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జననం (మ.1957).
1932 : తెలుగు రచయిత మరియు కవిగా ప్రసిద్ధి చెందిన ఉండేల మాలకొండ రెడ్డి జననం.
1966 : చంద్రుని కక్ష్య నుండి భూమి యొక్క చిత్రాన్ని లూనార్ ఆర్బిటర్ 1 తీసింది.
1971 : అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన షామూ మరణం.

ఆగష్టు 24

1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్ జననం (మ.1986).
1908 : స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు, రాజ్ గురు జననం (మ.1931).
1923 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా జననం (మ.2010).
1927 : తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత అంజలీదేవి జననం.
1945 : అమెరికాకు చెందిన ఒక ప్రొఫెషనల్‌ మల్లయుద్ధ క్రీడా ప్రమోటర్‌, ఎనౌన్సర్‌, కామెంటేటర్‌, చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌ జననం.
1981 : అమెరికా నటుడు, మాజీ ఫ్యాషన్ మోడల్ మరియు స్పోక్స్ పర్సన్ చాడ్ మైఖేల్ ముర్రే జననం.
1985 : తెలుగు సినీ గాయని, తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడిన గీతా మాధురి జననం.
1993 : ప్రజావైద్యుడు, గాంధేయవాది, వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రెండు లక్షల కంటి శస్త్రచికిత్సలు, ఉచిత వైద్య సేవలు అందించిన వెంపటి సూర్యనారాయణ మరణం (జ.1904).

ఆగష్టు 25

1609 : గెలీలియో గెలీలి మొదటి సారిగా తాను తయారు చేసిన టెలిస్కోపు ప్రదర్శించాడు.
1867 : ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే మరణం (జ.1791).
1952 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు దులీప్ మెండిస్ జననం.
1953 : తెలుగు సాహితీకారుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం (జ.1896).
1961 : అమెరికా దేశీయుడు, సంగీత గాయకుడు, గీత రచయిత మరియు నటుడు బిల్లీ రే సైరస్ జననం.
1962 : బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త మరియు సెక్యులర్ వాది తస్లీమా నస్రీన్ జననం.
1969 : ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి మఖ్దూం మొహియుద్దీన్ మరణం (జ.1908).
1987 : అమెరికా టీ.వీ., సినిమా నటి బ్లెక్ లైవ్లీ జననం.
1999 : ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ మరణం (జ.1924).
2012 : చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం.(మ.1930)

ఆగష్టు 26

1451 : అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం (మ.1506).
1743 : ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త లావోయిజర్ జననం (మ.1794).
1910 : ప్రార్థించే చేతులకన్న సేవించే చేతులు మిన్న అని చాటిచెప్పిన కరుణామయి మదర్ తెరిస్సా జననం (మ.1997).
1964 : తెలుగు వ్యక్తి, 275 సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు సురేశ్ జన్మదినం.
1965 : సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం.
1982 : భారతదేశములో మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాదు లో ప్రారంభించబడినది.

ఆగష్టు 27

1908 : అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం.(మ.2001)
1933 : స్త్రీ లైంగిక తత్వం మరియు స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి నాన్సీ ఫ్రైడే జననం.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
1963 : తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించిన ప్రముఖ సినీనటి సుమలత జననం.
1976 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు ముకేష్ మరణం.(జ.1923)
1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
2002 : ఉపాధ్యాయ ఉద్యమ రథసారధి, శాసన మండలి సభ్యులు సింగరాజు రామకృష్ణయ్య మరణం.(జ.1911)
2003: దాదాపు గత 60,000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరిగా వచ్చింది.
2010 : ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు లైంగిక వ్యాధి నిపుణుడు డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ మరణం.

ఆగష్టు 28

1749 : జర్మనీ రచయిత గేథే జననం.
1904 : ప్రముఖ స్వతంత్ర సమరయోదులు మరియు భారత పార్లమెంట్ సభ్యులు దాట్ల సత్యనారాయణ రాజు జననం.
1934 : దక్షిణభారత దేశపు నేపథ్యగాయని ఆర్కాట్ పార్థసారధి కోమల జననం.
1958 : ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు మరణం.(జ.1897)
1959 : తెలుగు సినీరంగ నటుడు సుమన్ తల్వార్ జననం.
1983 : శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి లసిత్ మలింగ జననం.

ఆగష్టు 29

తెలుగు భాషా దినోత్సవము
జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం, 1979 మరణం).
1863 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జననం (మ.1940).
1923 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ జననం.
1929 : పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని రావు బాలసరస్వతీ దేవి జననం.
1958 : అమెరికా కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం (మ.2009)
1959 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున జననం.

ఆగష్టు 30

1871 : పరమాణు కేంద్రక నమూనాను కనుగొన్న భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం (మ.1937).
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం (మ.1991).
1937: ప్రముఖ నటి జమున జననం.
1949 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం (జ.1899).
1982 : అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు ఆండీ రాడిక్ జననం.
1984 : ఎస్.టి.ఎస్ -41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
2006 : ఈజిప్టుకు చెందిన నవలాకారుడు, సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత నగీబ్ మెహఫూజ్ మరణం (జ.1911).
2008 : ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా మరణం (జ.1918).

ఆగష్టు 31

1864 : హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం (మ.1945).
1925 : సినీగీత రచయిత, సాహితీకారుడు ఆరుద్ర జననం (మ.1988).
1932 : తెలుగు కథా రచయిత. రావిపల్లి నారాయణరావు జననం.
1934 : తెలుగు సినిమా రచయిత ఇందుకూరి రామకృష్ణంరాజు జననం (మ.1994).
1944 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం.
1949 : అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
1969 : మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు జవగళ్ శ్రీనాథ్ జననం.
1907 : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే జన్మించాడు.
1997 : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య ప్రిన్సెస్ డయానా దుర్మరణం.
2014: ప్రముఖ చిత్రకారుడు బాపు మరణం. (జ.1933)

No comments:

Post a Comment

Rs. 150 .Com at GoDaddy.com!