Monday, 20 October 2014

స్వామి వివేకానంద సూక్తులు

భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.

దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవించ లేడు.

పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.
పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.

ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.1.సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం 2.అసూయ,అనుమానాల రాహిత్యం 3.సజ్జనులుగా మెలగాలనీ,మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.

భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే.

మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం,మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం,మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.

ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.

అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం,అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.

అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు.బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.

ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.

మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.

సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే.నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.

No comments:

Post a Comment

Rs. 150 .Com at GoDaddy.com!