Monday, 20 October 2014

స్వామి వివేకానంద సూక్తులు

'విముక్తి' అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగ్ర్రుతమై ఉన్నదో, వాడే విముక్తిని పొందుతాడు.

ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి.

జీవితం ఒక సంగ్రామం, కాని దానిని జయించుటకొక వ్యూహం కావలెను. దాని రూపకల్పన స్థాయిని అందవలెను. అదియు కౌమారమునందే. సందేహమెల? భావి జగజ్జేతావు నీవే.

చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది. వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు.

ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే...ఏ ఆదర్శమూ లేని మనిషి యాభైవేల తప్పులు చేస్తాడు.

మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలుకదు. కదలిక లేకుండా గుండె బతకదు.

మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నపుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారుకండి.

ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం. ఐతే ముందుగా వాళ్లకో జీవితాన్ని అందివ్వాల్సిన భాధ్యత కూడా మనందరి పైనే ఉంటుంది.

విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టు కాదు.

స్వయంకృషి,పట్టుదల,ధృడ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది.

ఒకటీ రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన పదీ ఇరవైమంది కార్యకర్తలు ఇవి చాలు. అవే అన్నటికీ నాశనం కానీ బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. మనకిప్పుడు వందలకొద్దీ నక్కలతో పని లేదు. సింహాలవంటి వాళ్లు ఆరుగురు చాలు. వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు.

మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేడమే విజయ రహస్యము.

మనమందరమూ కష్టపడి శ్రమించాలి. మన కృషిపైన భావిభారత బాగ్యోదయం ఆధారపడి ఉంది.

బీదసాదల దుస్తితియే భారతదేశంలోని అన్ని అనర్ధాలకు మూలకారణం. వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం.

No comments:

Post a Comment

Rs. 150 .Com at GoDaddy.com!