Tuesday 26 August 2014

చరిత్రలో ఫిబ్రవరి మాసం

ఫిబ్రవరి 1

భారతీయ తపాలా బీమా దినం.
1929 : తెలుగు భాషాభిమాని, సాహితీకారుడు, కవి జువ్వాడి గౌతమరావు జననం.
1945 : భారతీయ సాంకేతిక నిపుణుడు బొజ్జి రాజారాం జననం.
1956 : ప్రముఖ తెలుగు. తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత సుధాకర్ జననం.
1956 : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందం జననం.
1971 : భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.
1977 : భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1986 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ మరణం.
2003 : అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం.

ఫిబ్రవరి 2

1902 : దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జననం.
1913 : జపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త మసనోబు ఫుకుఒక జననం.
1925 : ప్రముఖ సాహితీకారుడు తిమ్మావజ్జల కోదండ రామయ్య జననం.
1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం.
1970 : ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది బెర్ట్రాండ్ రస్సెల్ మరణం.
1971 : ఒంగోలు జిల్లా ఏర్పాటయింది. తరువాత దీని పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.
1978 : ప్రముఖ కవి,రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం.
1985 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.

ఫిబ్రవరి 3

1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
1923 : నిజాం విమోచన కారుడు తమ్మర గణపతిశాస్త్రి జననం.
1924 : అమెరికా 28 వ అధ్యక్షులు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.(జ. 1856)
1963 : భారత రిజర్వ్‌ బ్యాంకు 23 వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం.
1975 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ మరణం.

ఫిబ్రవరి 4

1509 : శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
1891 : స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు మాడభూషి అనంతశయనం అయ్యంగారు జననం.
1911 : ప్రముఖ కవి, పండితుడు వేదుల సూర్యనారాయణ శర్మ జననం.(మ.1999)
1936 : సుప్రసిద్ధ హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
1938 : భారతీయ కథక్ నాట్య కళాకారుడు బిర్జూ మహరాజ్ జననం.
1943 : భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
1962 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ జననం.
1974: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం.

ఫిబ్రవరి 5

1915 : ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం (మ.1963).
1920 : బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జననం (మ.1997).
1936 : కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.
1961 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి మరణం (జ.1915).
1976 : భారతీయనటుడు మరియు భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ జననం.
2008 : ప్రముఖ ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేశ్ యోగి మరణం (జ.1918).

ఫిబ్రవరి 6

1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణించాడు.
1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
1925: ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.

ఫిబ్రవరి 7

1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.
1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జన్మించారు.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.

ఫిబ్రవరి 8

1880: ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జన్మించాడు.
1897: పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జన్మించాడు.
1971: నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.వం.మున్షీ మరణించాడు.

ఫిబ్రవరి 9

1936 : నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన అడబాల జననం (మ.2013).
1939 : ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు జననం (మ.2011).
1954 : ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు పరోపకారి క్రిస్ గార్డనర్ జననం.
1968 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు రాహుల్ రాయ్ జననం.
1969 : బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.
1976 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు సుమంత్ జననం.
1996 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మరియు వైణికుడు చిట్టిబాబు మరణం (జ.1936).
2008 : ప్రసిద్ధ సంఘ సేవకుడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) మరణం (మ.1914).

ఫిబ్రవరి 10

1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.
1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.
1911 : భారత్ లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1923 : X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం.(జననం.1845)
1931 : కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.
2010 : భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.మరణం
2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్‌ల్స్ విల్సన్ మరణం.

ఫిబ్రవరి 11

1847 : ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం.
1865 : ప్రముఖ హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం.
1917 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.
1922 : సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
1942 : పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ మరణం.
1968 : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణం.
1969 : అమెరికన్ నటీమణి జెన్నిఫర్ అనిస్టన్ జననం.
1974 : సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం.
1977 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ మరణం.

ఫిబ్రవరి 12

1809 : పూర్వపు అమెరికా అద్యక్షుడు అబ్రహం లింకన్ జననం.
1809 : జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతి వరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం.
1878 : స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం.
1942 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జననం.
1964 : తెలుగు సినిమా నటుడు జగపతి బాబు జననం.
1967 : తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.
1968 : తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం.
1976 : భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.

ఫిబ్రవరి 13

1879 : స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి సరోజినీ నాయుడు జననం.
1880 : సుప్రసిద్ధ పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం.
1911 : నవీన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జననం.
1914 : సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు మాదాల నారాయణస్వామి జననం.
1930 : ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు నూతి శంకరరావు జననం.
1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయించబడినది.
1971 : మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయకి సురభి కమలాబాయి మరణం.
1974 : బ్రిటీష్ గాయకుడు-గేయరచయిత రాబీ విలియమ్స్ జననం.

ఫిబ్రవరి 14

ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే)
1779 : నావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు జేమ్స్ కుక్ మరణం (జ.1728).
1898 : విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం (మ.1992).
1921 : ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జననం (మ.1954).
1931 : మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ జననం (మ.2008).
1952 : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ జననం.
1973 : తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు వై.వి. రావు మరణం (జ.1903).
1983 : ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం (జ.1935).

ఫిబ్రవరి 15

1564 : ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో (గెలీలియో గలీలీ) జననం.
1827 : అమెరికాకు చెందిన ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.
1869 : ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.
1921 : చరిత్రకారుడు, బీహార్ కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.
1948 : ప్రముఖ హిందీ కవయిత్రి en:సుభద్రాకుమారి చౌహాన్ జననం.
1956 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.
2001 : మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది.

ఫిబ్రవరి 16

1944 : భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే మరణం (జ.1870).
1954 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మజీ క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్ జననం.
1956 : భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా మరణం (జ.1893).
1961 : ఆర్ధిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం (జ.1902).
1964 : పారిశ్రామికవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జననం.
1985 : తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత నార్ల వెంకటేశ్వరరావు మరణం (జ.1908).
2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

ఫిబ్రవరి 17

1954 : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జననం.
1963 : అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖేల్ జెఫ్రీ జోర్డాన్ జననం.
1981 : అమెరికాకు చెందిన ప్రసార మాధ్యమాల ప్రముఖురాలు, మోడల్, గాయని, రచయిత్రి, ఫ్యాషన్ డిజైనర్ మరియు నటి ప్యారిస్ హిల్టన్ జననం.
1984 : భారతీయ సినిమా నటీమణి సదా జననం.
1986 : ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం (జ.1895).
1987 : ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు అసీం త్రివేదీ జననం.
2000 : మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

ఫిబ్రవరి 18

క్రీ.పూ.3102 : కలియుగము ప్రారంభమైనది.
1486 : రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు చైతన్య మహాప్రభు జననం (మ.1534).
1564 : ఇటలీ కి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు మైఖేలాంజెలో మరణం (జ.1475).
1745 : బ్యాటరీ ని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెసాండ్రో వాల్టా జననం (మ.1827).
1836 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (జ.1886).
1939 : భారతీయ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ మరణం (జ.1888).
1994 : భారతీయ నృత్యకారుడు, నటుడు మరియు నృత్య దర్శకుడు గోపీకృష్ణ మరణం (జ.1933).

ఫిబ్రవరి 19

1473 : సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ జననం.
1564 : భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త గెలీలియో గెలీలి జననం.(మ.1642)
1630 : ఛత్రపతి శివాజీ జననం.(మ.1680)
1905 : ప్రముఖ సినిమా రచయిత వెంపటి సదాశివబ్రహ్మం జననం.
1915 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం.
1930 : ప్రముఖ దర్శకుడు, కళాతపశ్వి కె. విశ్వనాథ్ జననం.
1941 : కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు మరణం.
1956 : ఆచార్య నరేంద్ర దేవ్ మరణం.
1965 : గుజరాత్ యొక్క రెండవ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా జననం.

ఫిబ్రవరి 20

1901 : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు జననం (మ.1978).
1925 : నేపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు గిరిజాప్రసాద్ కొయిరాలా జననం (మ.2010).
1935 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి జననం.
1973 : తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం (జ.1921).
1987 : అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1989 : తెలుగు సినిమా నటీమణి శరణ్య మోహన్ జననం.
2010 : తెలుగు సినిమా హాస్యనటుడు బి.పద్మనాభం మరణం (జ.1931).

ఫిబ్రవరి 21

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
1894: ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం (మ.1955).
1971: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణం (జ.1902).

ఫిబ్రవరి 22

1556 : మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ మరణం (జ.1508).
1732 : అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జననం (మ.1799).
1847 : స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది.
1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య జననం (మ.1949).
1939 : ప్రముఖ బాల సాహిత్య రచయిత కలువకొలను సదానంద జననం.
2009 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణం (జ.1914).
1958 : ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం (జ.1888).
1997 : బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం (జ.1920).

ఫిబ్రవరి 23

ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.
1483 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం (మ.1531).
1503 : ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం (జ.1408).
1855 : సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ మరణం (జ.1777).
1913 : ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం (మ.1971).
1941 : అణుబాంబు ల తయారీలో వాడే రసాయన పదార్థం ప్లుటోనియం ను కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు.
1957 : తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు జననం (మ.2012).
1982 : భారతదేశ టెలివిజన్ నటుడు మరియు మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ జననం.
1966 : దళిత కళాకారిణి మరియు కవయిత్రి చంద్రశ్రీ జననం.
2009 : 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

ఫిబ్రవరి 24

1810 : బ్రిటిష్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ మరణం (జ.1731).
1911 : ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి వంటి పత్రికలకు సహాయ సంపాదకత్వం వహించిన నవలా రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం.
1948 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జననం.
1951 : ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు కట్టమంచి రామలింగారెడ్డి మరణం (జ.1880).
1980 : ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం(జ.1897).
1984 : బాలానందం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు మరణం (జ.1905).
1986 : ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ మరణం (జ.1904).
2013 : ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు షేక్ సాంబయ్య మరణం (జ.1950).

ఫిబ్రవరి 25

1894 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా జననం (మ.1969).
1961 : ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం (జ.1891).
1966 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డాన్ అరుణసిరి జననం.
1974 : భారతీయ సినిమా నటి దివ్యభారతి జననం (మ.1993).
1981 : బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జననం.
1998 : ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
2004 : తెలుగు సినీ నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి మరణం (జ.1912).

ఫిబ్రవరి 26

1802 : సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త విక్టర్ హ్యూగో జననం.
1829 : బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు లెవీ స్ట్రాస్ జననం.
1932 : ప్రముఖ సామాజిక సేవకురాలు హేమలతా లవణం జననం.
1869 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా అఫ్జల్ ఉద్దౌలా మరణం.
1982 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఎలకా వేణుగోపాలరావు జననం.
1887 : పాశ్చాత్య వైద్యం లో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి మరణం.
1962 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు మరణం.
1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్ర ను అహ్మదాబాదులో ప్రారంభం.

ఫిబ్రవరి 27

1803 : ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
1931 : భారతీయ స్వాతంత్ర్యోద్యమకారుడు చంద్రశేఖర్ అజాద్ మరణం (జ.1906).
1932 : ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం (మ.2011).
1932 : సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు, బహుభాషావేత్త వేగె నాగేశ్వరరావు జననం (మ.1997).
1956 : లోక్‌సభ మొదటి స్పీకరు జి.వి.మావలాంకర్ మరణం (జ.1888).
1972 : తెలుగు సినిమా హాస్యనటుడు శివాజీ రాజా జననం.
2002 : అహమ్మదాబాదు వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
2005 : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు పుహళేంది మరణం.

ఫిబ్రవరి 28

జాతీయ విజ్ఞాన దినోత్సవము.
దర్జీ ల దినోత్సవము.
1927 : భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జననం (మ.2002).
1928 : ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త తుమ్మల వేణుగోపాలరావు జననం (మ.2011).
1948 : ప్రముఖ రంగస్థల నటీమణి రాజేశ్వరి పువ్వుల జననం.
1963 : భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం (జ.1884).
1976 : అమెరికన్ నటి మరియు మాజీ ఫ్యాషన్ మోడల్ అలీ లార్టర్ జననం.
2014 : బహుగ్రంథ రచయిత, సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టు స్థాపకుడు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణం (జ.1926).

No comments:

Post a Comment

Rs. 150 .Com at GoDaddy.com!